BHAGAVATA KADHA-3    Chapters   

(2)

లోకపాలురద్వారా అస్త్రప్రాప్తి

ఛప్పయ

ఇంద్ర, వరుణ, యమ, ధనద ఆ, ఈస్త్ర సహిత దర్శనదియే |

కరీ కృపా జిన కృపా తేఁ, కృష్ణ కహాఁ అబ చలి గయే ||

అర్థము

ఇంద్ర, వరుణ, యమ, కబేరాదులు అస్త్రములతో వచ్చి కృపఁజూపినది ఏ మహామహుని కృపచేతనో అట్టి కృష్ణుఁడెచ్చటికో వెడలిపోయెను.

రాజా! శంకరుని అనుగ్రహమునుబొంది నేను మిక్కిలి సంతోషపడితిని. ఏ దేవుని దర్శనము దేవతలకుఁగూడదుర్లభమో, అట్టివాఁడు నా యెదుట పార్వతీ దేవితోఁగూడి దర్శన మొసంగెను. గొప్పగొప్ప మహర్షు లెవని వేదమంత్రములతోడను, లనేక పావనద్రవ్యముతోడనే శ్రద్ధతోఁబూజింతురో, అభిషేకము కావించెదరో, ఆ నీలకంఠునిపై నేను అజ్ఞానవశమునఁ బుష్పవృష్టిని గుణిపింపవలసినదిపోయి బాణవృష్టిని గుఱిపించితిని. పరమ పావనులగుతపోధనులు ఎవని చరణములను బట్టుకొనుటకు భయపడుచుందురో, అట్టి త్రైలోక్యపూజిత విగ్రహుని నేను గ్రోధవశమున ముష్టిప్రహారము కావించితిని. ఆ దేవాధిదేవుని స్పర్శసుఖము నాకు లభించినది. నేనెంత ధన్యుఁడను? నాయీ కార్యములకు కాలస్వరూపుఁడగు రుద్రుఁడుకోపపడక, నా యవజ్ఞకు అప్రసన్నుఁడై నాకు దారునశాప మీయకపోఁగాఁ బ్రసన్నుఁడై పాశుపతాస్త్రమునొసఁగి, నాయుద్ధకౌశలమున కాతఁడు పరమప్రసన్నుఁడగునట్లు చేసిన శ్రీకృష్ణప్రభుని కృపను ఏమని పొగడఁగలను? నా ప్రయత్నమునను, బ్రయోజకత్వము నను ఆ పురాణపురుషుఁడగు పవుపతిని బ్రసన్నుని జేసికొనఁగలిగిన క్షమత్వము నాకడ యెక్కడిది? శ్రీకృష్ణ కృపచేతనే త్రిపురారియు. త్రిలోచనుఁడు నగు శివుఁడు సంతుష్టి చెందఁగలిగెను. నే నిట్లనుకొనుచుండగఁనే పశ్చిమదిక్కునుండి గొప్ప ప్రకాశము నావైపునకు వచ్చుచున్నట్లు నాకు తోఁచెను. వైడూర్యమువలె నున్న యాప్రకాము ఆకాశమునుండి క్రమక్రమముగా దిగినది. మొట్టమెదట అది మెఱపు మెఱసినదనుకొంటిని. కాని నాకు విమానము స్పష్టముగఁ గనఁబడునప్పటికి, ఎవరో లోకపాలుఁడు దిగుచున్నాఁడనుకొంటిని. వరుణదేవుఁడు తనకాంతులచే దిక్కుల మిరుమిట్లు కొలుపుచు నావైపునకు వచ్చుచుండుటను గాంచి తిని. ఆతని వెనుక దివ్యరూపమును ధరించిన జలచర జీవుల కధిష్ఠాతయగు దేవుఁడుకూడ ఉండెను. నద, నదీ, సముద్ర,సరోవర, సర్ప, సాధ్యాది దైత్యులుకూడ ప్రకాశముగ మూర్తి మంతములై ఆతని ననుసరించుచుండిరి. నేను లేచి యా పశ్చిమాధిపతికి నమస్కరించి, స్తోత్రములచే సత్కరించితిని. నేనింకను గూర్చుండనేలేదు. ఇంతలోనే దక్షిణదిక్కునుండి సూర్యునివలె బ్రకాశించుచు నావైపునకు వచ్చుచున్న యముని గాంచితిని. అతఁడాసమయమున తన దేరూపమును జాలించి మానుష రూపమును ధరించెను. ఆతఁడు చేత దండమును ధరించి పితర, గుహ్యకాది దేవతలు ఉపదేవతలు వెంటరాగా స్వభావమున నుగ్రుఁడయ్యు సౌమ్యరూపమును ధరించి వచ్చెను. ఆతని కృష్ణ వర్ణమగు శరీరము కాంతిచే నీలమణివలెఁ బ్రకాశించుచుండెను. నేను రెండుచేతులనుజోడించి సమస్తజీవులకు సంహారకర్తయును, దక్షిన దిక్పాలకుఁడు నగుయమునకుఁ బ్రణామము కావించితిన. ఆతఁడును బ్రసన్నుఁడై నావైపునకే వచ్చెను.

ఇంతలోలే తూర్పుదిశనుండి దవ్యగంధముతో సుఖద సంగీత ధ్వనితో నొక విమానము నావైపునకు వచ్చుచుండుటను గాంచితిని. దానిలోఁ దట్టియగు శచీదేవితోఁగూడ దేవేంద్రుఁడుండెను. ఆయనపైన వేలకొలఁది కుచ్చులుగల శ్వేతఛత్ర మున్నది. స్వర్గములోని దేవాంగనలు చామరములు వీచుచుండిరి. దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగవారు ఆతని స్తుతించుచుండిరి. ఒఇకరికి మించి ఒకరు మిక్కిలి లావణ్యయుక్తులై అసంఖ్యాకులగు అప్సరసలు ఆతనిని జుట్టుకొని యుండిరి. ఆతఁడు దివ్యమగు హరితవర్ణమగు వస్త్రమును ధరించి యుండెను. శచీమాత అరుణవర్ణమగు చీరెను ధరించెను. ఇద్దరురు నందనవనములోని కల్పవృక్ష పుష్పములచేఁ గూర్చఁబడిన దివ్యమాలనను ధరించిరి. ఆ దివ్య మాలా సుగంధముచే దిక్కుల సువాసితము లయ్యెను. అనేకమంది దేవాంగనలు తాళస్వరముతో వివిధవాద్యములతోఁ తమ కోకిల కంఠములతో విమానముమీఁద దివ్యగానముచేయుచుండిరి. ఈ విధముగ పూర్వదిశా దిక్పాలురు, త్రిలోకాధినాథులు, పూజ్యపితయగు దేవేంద్రుఁడు వచ్చుటను గాంచి నాహృదయము ప్రేమప్లావిత మయ్యెను. నేను శ్రద్ధాభక్తులతో శచీదేవేంద్రులకు నమస్కరించితిని. ఆతఁడుకూడ ఆగిరపై నిలిచిన విమానము మీఁద పరివేష్టించెను. ఆ తరువాత ఉత్తర దిశాధిపతియు, సమస్త దన రత్నములకు ప్రభువును, దేవతలకు కోశాధిపతియునగుకుబేరుఁడు తన కాంతిచే నాకాశమండలమును బ్రకాశింపచేయుచు, వివిధ రత్నములచేతను, మణులచేతను బ్రకాశించు నా పర్వతశికరము పైకి దిగి, తన ఉత్తరదిశా శిఖరమున సుఖాసీనుఁడయ్యెను.

నల్గురు లోకపాలకులు వచ్చుటచే నేను యథాలబ్ధోప చారములచే యథావిధిగ వారిని బూజించితిని, నాపూజల నన్నిటిని శాస్త్రవిధిచే గ్రహించి వారిలో దక్షిణ దిశాధిపతి యగు యముఁడిట్లనెను:- ''అర్జునా ! మేమందఱమును నీతపస్సునకు మెచ్చితిమి. మానవుల కత్యంత దుర్లభమగు లోకపాలుర మగు మమ్ముల నందఱను బాగుగా దర్శించుకొనుము. పుత్రా! నీ శీన స్వభావ, వ్రత, బ్రహ్మచర్యములకుఁ బ్రసన్నులమైతిమి. నీవునీ ప్రబల పరాక్రమముచే పశుపతినాథుఁడను త్రిలోచనుని సంతోషపరచి ఆతని కృపను బొందితివి. ఇదిగో, తీసికొనుము. నా యమోఘ దండమును దీసికొనుము. దీనిచే నీవుశత్రు సంహారము చేయఁగలవు. భీష్మ, ద్రోణ, కర్ణాదులెవరును నిన్ను జయింపఁజాలరు. ఏకర్ణుని బలపరాక్రమమును గాంచి ధర్మరాజు నిత్యము భయభీతుఁ డగుచున్నాఁడో ఆకర్ణునిగూడ నీవు సంగ్రామములోఁ జంపగలుగుదువు'' ఇట్లని ఆతఁడు నాకు తన యమోఘదండము నొసంగెను. ఈ విధముగనే వరుణుఁడు తన పాశము నొసంగెను. కుబేరుఁడు కూడ తన ప్రస్వాపనాస్త్రమును బ్రసాదించెను. దేవేంద్రుఁడు కూడ నాకు సమస్త దివ్యాస్త్రముల నిచ్చునట్లు వాగ్దానమొనరించెను. ఆతఁడిట్లనెను:- పుత్రా! నేను నీకు సమస్తములగు నమోఘాస్త్రముల నొసంగెదను. అయితే నీవు దేవతలకు మిక్కిలి ప్రియమును, దుష్కరకార్యమును చేయవలసి యుండును. నేను నీ యీ మానుషశరీరము తోడనే స్వర్గమునకుఁ బిలిపించుకొందును. నీ గౌరవము నినుమడింపఁజేసెదను. సర్వత్ర నీ బలఖ్యాతిని వ్యాపింపఁజేసెదను. మరల నీశరీరము తోడనే నీ సోదరుల దగ్గఱకుఁజేర్చెదను. నీవు చింతను వీడి స్వర్గమునకు వచ్చుటకు సిద్ధముగ నుండుము. నేను రథమునిచ్చి నాసారథియగు మాతలిని బంపెదను. ఆతనివెంబడి నీవు రావలెను.'' ఇంద్రుఁడిట్లని లోకపాలురతో నచ్చటనే అంతర్థానమయ్యెను. నేను నలుదిక్కలను నిర్ఘాంతుఁడనై చూచుచుంటిని. ఏమున్నది? ఇదంతయు నాకు స్వప్నముగఁదోఁచెను. ఈలోకపాలుర కృపను నేను వాసుదేవుని అవ్యాజానుగ్రహ కారణముననే బొందితిని.

రాజా! ఒక్కసారిగా శంకరుని యొక్కయు, సమస్తలోక పాలుర యొక్కయు అను గ్రహమువలన నస్త్రములను బొంది నేను మిక్కలి సంతసించితిని. నేను స్వర్గ స్వప్నములు చూచుచుంటిని. స్వర్గమెట్లుండునో గదా! అచ్చటి నందనవన మత్యద్భుత మందురే. అక్కడ అందఱును విమానములందుననే మందురని వినికిడి. ఆ విమానములు కామగములఁట. దేవేంద్రుని పురము దివ్యము. అచ్చటి సమస్తభోగములు దివ్యములు. అచ్చట ఐరావతమున్నది. మూర్తిమంతములగు తీర్థములు, నదీనదముల యొక్క అధిష్ఠాతృదేవతలు అచ్చట నుండును. ఘోరతపస్సు చేసిన వారును, చిరకాలము శమ, దమ, సంయమాది సద్గుణా చరణము చేసినవారు, ధర్మాచరణముచేసినవారు మాత్రమే ఆస్వర్గమును జూడఁగలుగుదురు. గొప్ప గొప్ప రాజర్షులును, మహర్షులును, బ్రహర్షులును, దేవర్షులును, యశస్వులును, తపస్వులును. సత్పురుషులును మాత్రమే స్వర్గమును దర్శంపఁగలరు. అదియును ఈ మానవ శరీరముతోఁగాదు. చచ్చినతర్వాత దివ్యదేహమును ధరించి చూడఁగలరు. నేనీ పాంచభౌతికమగు నీమానవ శరీరములతోడనే స్వర్గమును జూచుటకు నేనేమి సుకృత మొనర్చితిని? స్వర్గగామియగునా డీఁశరీరముతో మరల బూమిమీఁదకు రాఁడు. క్షీణ పుణ్యుడై అన్యయె నులలో జన్మించును. పుణ్యమైపోఁగానే అసత్కారపూర్వకముగఁ గ్రిందకుఁ ద్రోసివేయుదురు. నేనీ శరీరముతోస్వర్గమునకు వచ్చి మరల నాసోదరులనుగలిసికొనవచ్చునని దేవేంద్రుఁడనెను. నేనీ శరీరము తోడనే స్వర్గమును జూచివచ్చుట కేమి పుణ్యకార్యములొనర్చితిని? ఏమి సుకృత ఫలమిది? నేను జేసిన పుణ్యమేమియును లేదు. శ్రీకృష్ణకృప వలననే యిట్టి దేవ దుర్లభమగు సుయోగము ప్రాప్తించినది. దేవకీ నందనుని దయ, అనుగ్రహములు కలవానికి ఏకార్యమును అసంభవము కాదు. ఇట్లనుకొనుచుండఁగనే గొప్ప ద్వీపమువలెనున్న గొప్ప దివ్యరథము ఆకాశమునుండి మందరాచలము మీఁదకు దిగుట కనబఁడినది.

ఆ రథము సూర్యుని కంటె మిక్కిలిగఁ బ్రకాశించు చుండెను. చిన్న చిన్న గంటలు కట్టఁబడినవి. అవి రథము నడుపు నపుడు మదురధ్వని చేయుచుండును. దానిలో ననేకములగు నాయుధములుపెట్టఁబడి యుండెను. అది యిచ్చానుసారముగఁ జిన్నదిగఁబెద్దదిగ కాఁగలదు. అది తన దివ్యకాంతులచే మండరాచలమును శోభకావింపఁజేయుచు నాముందునకువచ్చి వ్రాలెను. అది నేలమీఁద నానలేదు. మధ్యలోనే నిలిచినది. వందలకొలఁది హరితాశ్వములు దానిక కట్లఁబడినవి. వాటి కళ్లెములు ఒకదాని కొకటి కట్టఁబడినవి. వాటిని మాతలి యను ఇంద్రసారథి నడుపుచుండును. నా సమీపమునకువచ్చి రథము నిలువఁగానే సారధ్య కర్మవిశారదుఁడగు మాతలి దిగి నా దగ్గఱకు వచ్చెను. ఆతఁడు రాఁగానే నాకు నమస్కరించి నిలుచుండఁగా నేనాతని నభినందించితిని. ఆతఁడు నాతో నిట్లనెను:- ''కురుకుల నందనా! నిన్ను నీ తండ్రియగు దేవేంద్రుఁడు పిలిచెను. ఆతఁడు స్వర్గములో నిన్నుఁజూడఁదలఁచినాఁడు అచ్చట నీ యెడల వాత్సల్యస్నేహములఁ బ్రకటింప నుత్సహించుచున్నాఁడు. నీవువచ్చి ఆతనిని సంతోషపెట్టుము. నీవునీ సద్గుణములచే చరాచరప్రపంచమునకు స్వామియగు వాసుదేవుని సంతోషపెట్టితివి. అందువలననే యితరులకు లభింపని ప్రాప్తి నీకుఁబ్రాప్తించినది. నీవుస్వర్గమునకు వచ్చుటకు పార్థివదేహమును వదలి దివ్యదేహమును ధరింపవలసిన పనిలేదు.నీవీ శరీరము తోడనే స్వర్గసుఖములను బొందఁగలవు. మరల నీ యిచ్ఛానుసారముగ మర్త్యలోకము నకు రాఁగలుగుదువు. నీ వాలస్యము చేయక నా వెంట స్వర్గమునకు రమ్ము.''

నేను వినయముతో మాతలితో నిట్లంటిని:- ''ఇంద్ర సారథీ! నేనే నీకు స్వాగతమిచ్చు చున్నాను. నీ వినయవాక్కులకు అభినందిచుచున్నాను. ధర్మజ్ఞా! మానవులకు మిక్కలి దుర్లభమగు నీదర్శనము, నీ దివ్యరథ దర్శనము లభించినది. ఇది నా యదృష్టము. ఈ రథముమీఁద అశ్వమేధ, రాజసూయాది యజ్ఞములు చేసిన రాజర్షులెక్కి పోవుచుందురు. శ్రీకృష్ణకృపచే నేను దీని నెక్కఁగలుగుచున్నాను. ముందు నీ వెక్కిన తర్వాత నే నెక్కెదను.'' నా మాటలను విని మాతలి రథముపై నెక్కి గుఱ్ఱపు కళ్లెములను సరిచేసెను.

నేను దశ దిశలలోని దేవతలకు నమస్కరించితిని, బ్రహ్మర్షులు, దేవర్షులు, సిద్ధులద్వారా సేవింపఁబడుచుఁ బరమ రమణీయములగు శిఖరములుగల మందరాచలమును ఆజ్ఞ అడిగితిని. నా సమీపమునఁగల పశు, పక్షి, వృక్ష, లతా గుల్మాదులకడ శలవు తీసికొని, ఆ దివ్యరతమును బరిక్రమించి, దానిపై నెక్కి తిని, అబ్చ! ఆ రథమెంత సుందరమైనది! దానిమీఁది వనితన మెంత గొప్పది! అది దివ్యగంధముచే సువాసితమయ్యెను. దాని మీఁదఁ గూర్చుండఁగానే నా కత్యంతాహ్లాదముకలిగెను. భగవత్కృపచేతనే యీ మానుషశరీరముతోడనే దేవేంద్రుని రథముపై గూర్చుండఁ గలిగితిని. నా యానందమునకు మేఱలేకుండెను. నేను సమస్తశోకమును, చింతను, గ్లానిని, సంతాపమును, ఆకులతను వీడి మిక్కిలి ప్రముదితుఁడనైతిని, ఇంతలో స్వర్గ విమానములు వచ్చెను. నందన వనము సమీపించెను. అంత మాతలి యిట్లనెను:- ''మహాభాగా! నీవు వచ్చితివి. ఇఁక స్వర్గమును జూడుము.'' నిమిషములో మేము అమరావతీ నగర సమీపమునకు వచ్చితిమి. వందలకొలఁది దేవతలు, గొంధర్వులు, అప్సరసలు నాకు స్వాగతమొసంగిరి. అందఱును మిక్కిలి సత్కారముతో నన్న దేవేంద్రుని దివ్యసభకుఁ గొనిపోయిరి. ఇది నాకు లభించిన దుర్లభ సౌభాగ్యము. అదేమనఁగా:-

BHAGAVATA KADHA-3    Chapters